అరుదైన ఫొటోను షేర్ చేసిని అమితాబ్‌… ఎందుకంటే..?

బాలీవుడ్ అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చే పేరు అమితాబ‌చ్చ‌న్‌. ఆయ‌న యాక్టింగ్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. న‌ట‌న అంటే ఆయ‌నే అన్న‌ట్టు ముద్ర వేశారు. బాలీవుడ్ మెగాస్టార్‌గా ద‌శాబ్దాల పాటు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీని ఏలారు ఆయ‌న‌. ఈ రోజు ఆయ‌న జీవితంలో ఒక స్పెష‌ల్ డే.

జయా బచ్చన్ సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు జూన్ 3, 1973లో పెండ్లి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమితాబ్ ఓ అద్భుత‌మైన పోస్ట్ చేశారు. 48 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లినాటి ఫొటోను అప్‌లోడ్ చేశారు. త‌మ‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ పోస్టుకు ఆయన అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. వారిద్ద‌రికీ పెండ్లి రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ తెగ లైకులు కొడుతున్నారు. ఇక ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు అమితాబ‌చ్చ‌న్ ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు. అయితే ఇప్పుడు కొవిడ్ కార‌ణంగా అవి షూటింగ్ నిలిపివేశారు.

Share post:

Popular