‘మహారాజా’ గా వస్తున్న అమీర్ ఖాన్ తనయుడు…!

సిని ప్ర‌ముఖుల వార‌సులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వ‌డం చాలా కామ‌న్‌. ఇప్ప‌టికే చాలామంది త‌మ కుమారుల‌ను హీరోలుగా, కుమార్తెల‌ను హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేశారు. ఇందులో చాలామంది స‌క్సెస్ అయ్యారు. త‌మ తల్లిదండ్రుల‌కు త‌గ్గ వారసులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్‌లో ఆయ‌న స్టార్ హీరోగా కొన‌సాగుతున్నారు.

ఇక ఆయ‌న కూడా ఇప్పుడు త‌న వారసుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆయ‌న కొడుకు జునైద్‌ ఖాన్ త్వ‌ర‌లో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్ప‌టికే ఆయన హీరోగా చేస్తున్న మూవీ ఫిబ్రవరి 15న ఘ‌నంగా ప్రారంభ‌మైంది. దీనికి సిద్ధార్థ్‌ పి.మల్హోత్రా దర్శకత్వం చేస్తున్నాడు. ఇక ఈ మహారాజా మూవీ గురించి అమీర్ కుమార్తె ఇరాఖాన్ తెలియ‌జేసింది. ఇందుకోసం లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో త‌న అన్న జునైద్‌తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ సినిమా అప్‌డేట్‌ను తెలిపింది. అందులో జునైద్‌ఖాన్ మొద‌టి మూవీ మహారాజా స్టార్ట్ అయిందంటూ స్ప‌ష్టం చేసింది.

Share post:

Popular