జెనీలియాకు ఆమె భర్తకు మ‌ధ్య‌ ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకే?

జెనీలియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..హ హ హాసిని తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకుంది. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన జెనీలియా..హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌ యంగ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకుందీ బ్యూటీ. రితేశ్, జెనీలియా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నిజానికి జెనీలియా కంటే ఆమె భర్త రితేష్ చాలా పెద్దవాడు.

ఇద్దరి మధ్య ఏకంగా 9 సంవత్సరాల తేడా ఉందట. అయినా కూడా చక్కని అండర్ స్టాండింగ్‌తో జీవితాన్ని కొనసాగిస్తూ.. ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు ఈ జంట‌. కాగా, పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటున్న జెనీలియా.. త్వ‌ర‌లోనే రీఎంట్రీకి సిద్ధ‌మ‌వుతుందంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

Share post:

Popular