ప్రముఖ నటుడు మృతి…!

సినీ ఇండ‌స్ట్రీలో ఒక‌ప్ప‌టి న‌టుడు అయిన చంద్ర‌శేఖ‌ర్ ఇక లేరు. రామాయణ్ ధారావాహికతో ఆయ‌న న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్ట‌ర్‌గా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన చంద్ర‌శేఖర్ కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బుధవారం ఉదయం త‌న సొంత ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. త‌న తండ్రి నిద్రలోనే మృతి చెందాడ‌ని, ఈ రోజు సాయంత్రం తండ్రికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చంద్ర శేఖర్ కొడుకు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు.

హైదరాబాద్‌లోనే 1923లో జ‌న్మించిన చంద్రశేఖర్ నటనపై ఉన్న ఆస‌క్తితో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సురంగ్ అనే మూవీతో కథానాయకుడిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత కవి, మస్తానా, బసంత్ బహార్ లాంటి ఎన్నో సినిమాల్లో న‌టించి మెప్పించారు. దాదాపు 250కిపైగా సినిమాల్లో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు చంద్రశేఖర్. కాగా ఆయ‌న మృతికి సినీ ప్ర‌ముఖులు, రాజకీయ ముఖ్య‌లు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.