బ్లాక్ బస్టర్ దర్శకుడితో ​వరుణ్..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ఈ హీరో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ విన్న వరుణ్ నచ్చిన వెంటనే కథకు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే గని దాదాపు పూర్తవ్వడంతో అన్ని కుదిరితే ‘ఎఫ్ 3’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగును దసరాకి మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారని తాజా సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందనీ, తనకి హ్యాట్రిక్ హిట్ తెస్తుందని వెంకీ కుడుముల భావిస్తున్నాడట. ఇక వెంకీ తన తొలి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా రష్మిక మందన హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

Share post:

Popular