బిజినెస్ మెన్‌తో పెళ్ళికి సిద్ధమైన త్రిష‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

త్రిష‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాష‌ల్లోనూ న‌టించి.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. కెరీర్‌ తొలినాళ్ల‌లో ఎన్నో సూపర్‌ హిట్లు దక్కించుకున్న త్రిష‌కు ప్రస్తుతం అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఇదిలా ఉంటే.. త్రిష ఎప్పుడెప్పుడు పెళ్లీ పీట‌లెక్క‌బోతుందా అని అంద‌రూ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే త్రిష పెళ్లిపై అనేక వార్త‌లు రాగా.. అవ‌న్నీ పుకార్లే అని తేలిపోయాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. త్రిష ఒక బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్ధం అయిందని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే త‌న పెళ్లిపై ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే.. త్రిష నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. కాగా, గ‌తంలో వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని స్పెషల్‌ ఫ్లైట్‌లో విహారయాత్ర కూడా చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ పెళ్లి ఆగిపోయింది.

Share post:

Popular