విశాఖపట్నం రౌడీగా రాబోతున్న సుమంత్‌.. !

టాలీవుడ్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు సుమంత్. ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనుమడి గా అందరికి సుపరిచితుడే. అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. అందులో ఆ మధ్య వచ్చిన ఎన్.టీ.ఆర్ – కథానాయకుడు చిత్రంలో ఆయన తాత అక్కినేని పాత్ర పోషించి అందరి నుండి ప్రశంసలు పొందాడు సుమంత్. ఆ తరువాత 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా కపటధారి మూవీతో మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు సుమంత్‌ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా అనగనగా ఒక రౌడీ. ఈ చిత్రానికి మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాని ఏక్‌దోత్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై గార్లపాటి రమేష్‌, డా.టీఎస్‌ వినీత్‌ భట్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ పనులను కంప్లీట్ చేస్తున్నారు మూవీ బృందం. సుమంత్‌ కెరీర్‌ లోనే వైవిధ్యమైన సినిమాగా ఈ చిత్రం ఉండనుంది. ఇందులో సుమంత్‌ పాత్ర చాలా డిఫరెంట్ గా తీర్చిదిద్దారు మేకర్స్. ఆయన పాత్రలో కొత్తదనం కనిపిస్తూ, అందరికి చాలా బాగా నచ్చుతుందని అంటున్నారు మేకర్స్. విశాఖపట్నం రౌడీగా, వాల్తేరు శీనుగా సుమంత్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీకి మార్క్‌.కె. రాబిన్‌ సంగీతం అందిస్తున్నారు.

Share post:

Latest