బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన హీరో సత్యదేవ్?!

టాలెంటెడ్ న‌టుడు స‌త్య‌దేవ్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌త్య‌దేవ్‌..జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌దేవ్‌.. విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడుగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇక ఇటీవ‌ల ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో మ‌రిసారి విశ్వ‌రూపం చూపించిన స‌త్య‌దేవ్‌.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న తాజా చిత్రం రామ్ సేతు. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు.

ఈ సినిమాను పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళం నుండి సీనియర్ నటుడు నాజర్, తెలుగు నుండి సత్యదేవ్‌లను తీసుకున్నారట. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఇంత పెద్ద సినిమాలో భాగస్వామ్యం కావడం సత్యదేవ్ కు దొరికిన మంచి అవకాశమనే చెప్పాలి.

Share post:

Latest