‘క్యాలీఫ్లవర్’ సినిమా టీజర్ మీ కోసం..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి హృద‌య కాలేయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఎప్పటికప్పుడు డిఫ‌రెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ వస్తున్నాడు సంపూ. 2014లో వచ్చిన హృదయకాలేయం మూవీతో బ‌ర్నింగ్ స్టార్‌గా మారిన సంపూర్ణేష్ బాబు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాడు. ప్ర‌స్తుతం సంపూర్ణేష్ బాబు బ‌జార్ రౌడీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్యాలీ ఫ్ల‌వ‌ర్ అనే టైటిల్‌తో సంపూర్ణేష్ బాబు ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఈ రోజు సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. స్వతంత్రం తెచ్చి గాంధీజీ చరిత్ర సృష్టించారు అంటూ ఈ మూవీ టీజర్ ఇంటరెస్టింగ్ గా మొదలు అవుతుంది. అదే కాలంలో భారత్ దేశంలో స్త్రీ పవిత్రత్వాని ప్రపంచానికి తెలియచెప్పటానికి ఓ మహానుభావుడు గుర్రం ఎక్కి ఇంగ్లాండ్ నుండి ఇండియాకి వచ్చాడు. అతనే గ్రాండ్ ఫాదర్ అఫ్ కాలీఫ్లవర్ అంటూ సంపూ ఇంట్రో అదిరిపోయింది. ఈ చిత్రంలో సంపూ బ్రిటీష‌ర్ పాత్ర‌లో కనిపించి అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని మధుసూదన క్రియేషన్స్ రాధాకృష్ణ టాకీస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Share post:

Latest