`శాకినీ-ఢాకినీ` అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!

ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాన్ని మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి చిత్రాలే ఎక్కువ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొరియన్‌ చిత్రం మిడ్‌ నైట్‌ రన్నర్స్ ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు.

- Advertisement -

నివేదా థామస్‌, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా సుధీర్‌వర్మ దర్శకత్వంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

శాకినీగా రెజీనా … ఢాకినిగా నివేద థామస్ నటిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అధికార‌క ప్ర‌క‌ట‌న రానుంద‌ని.. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Popular