లాక్‌డౌన్‌ను అలా యూజ్ చేసుకుంటున్న ర‌ష్మిక‌!

అతి త‌క్కువ స‌మ‌యంలోనే ద‌క్షిణాదిలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సినిమా పూర్తి కాక‌ముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రాధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న‌ గుడ్ బై చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మ‌రో రెండు ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేసిన‌ట్టు టాక్‌. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్స్ బంద్ అయ్యాయి.

దీంతో ఇంటికే ప‌రిమితం అయింది ర‌ష్మిక‌. అయితే తనకు హిందీ భాష అంతగా రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ సమయాన్ని అందుకు యూజ్ చేసుకుంటుంద‌ట‌. షూటింగ్ మొదలయ్యే సమయానికి హిందీ భాష మీద ప‌ట్టు సాధించేందుకు కుస్తీ ప‌డుతుంద‌ట రష్మిక‌.

Share post:

Latest