ఆ సీనియ‌ర్ హీరో మూవీలో ర‌ష్మికి బంప‌ర్ ఛాన్స్‌?

ర‌ష్మి గౌత‌మ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసిన ర‌ష్మి.. వెండితెర‌పై పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంక‌ర్‌గా బుల్లితెర‌పై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఇప్పుడు ఈ భామ‌కు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నాగార్జున సినిమాలో బంప‌ర్ ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో ప్ర‌స్తుతం ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

అయితే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం ర‌ష్మిని ఎంపిక చేశార‌ట మేక‌ర్స్‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. కాగా, గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ గుంటూరు టాకీస్ చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి నాగ్ సినిమాలో ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది.

Share post:

Latest