`గూని బాబ్జీ`గా రావు రమేష్‌..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

రావు ర‌మేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నటుడు రావు గోపాల రావు కుమారుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు చేరువై త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడీయ‌న‌. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగారు.

విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావు ర‌మేష్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా మహా సముద్రం సినిమాలో రావు ర‌మేష్ పోషిస్తున్న రోల్‌ను రివిల్ చేస్తూ.. ఆయ‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడ‌ద‌లు చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రావు ర‌మేష్ గూని బాబ్జీ అనే డిఫ‌రెంట్ పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కూడా రావు రామేష్ చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నారు. కాగా, అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Image

Share post:

Latest