పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ర‌కుల్‌..గుట్టు విప్పేసిన మంచు ల‌క్ష్మి!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌కుల్‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

- Advertisement -

ఓ వైపు సినిమాలు, మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న‌ రకుల్ త్వ‌ర‌లోనే పెళ్లీ పీట‌లెక్క‌బోతోంద‌ట‌. ఈ విష‌యాన్ని ర‌కుల్ బెస్ట్ ఫ్రెండ్ మంచు ల‌క్ష్మీనే బ‌య‌ట పెట్టింది. తాజాగా వీరిద్ద‌రూ రానా ద‌గ్గుబాటి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌నెంబర్ వన్ యారీ షోలో రచ్చ చేశారు.

ఈ షోలో రానా.. ర‌కుల్‌ను పెళ్లి ఎప్పుడు? అని ప్ర‌శ్నించాడు. అందుకు వెంట‌నే మంచు ల‌క్ష్మీ స్పందిస్తూ..ఈ ఏడాదిలోనే రకుల్ పెళ్లి ఉంటుందని చెప్పేసింది. కాదు కాదు అంటూ రకుల్ వారించగా.. పెళ్లి కాకపోతే ఆ ప్రయత్నాలైనా జరుగుతాయ్.. లేదా బాయ్ ఫ్రెండ్ వస్తాడేమో అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. మ‌రి మంచు ల‌క్ష్మీ స‌ర‌దాగా అందో..లేదా నిజంగానే ర‌కుల్ పెళ్లి చేసుకోబోతోందా.. అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.

Share post:

Popular