లేడీ బాస్ గా రాయ్ ల‌క్ష్మీ..?

ప్రముఖ హీరోయిన్ రాయ్ ల‌క్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ హాట్ హాట్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ హాట్ భామ బ్లాక్ డ్రెస్ లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కాంచ‌న‌మాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు రాయ్ లక్ష్మీ ప‌రిచ‌య‌మైంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది.

రాయ్ ల‌క్ష్మీ తెలుగులో పలు సినిమాలు చేసింది. బలుపు, ఖైదీ 150 లాంటి పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఐటెం సాంగ్స్ వల్ల రాయ్ లక్ష్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. రాయ్ లక్ష్మిని ఇన్స్ స్టాగ్రామ్ లో 2.7 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా వేలల్లో లైక్ లు, వందల్లో కామెంట్స్ వస్తున్నాయి. ఈమె తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతి పోగొట్టేస్తోంది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ నాలుగు సినిమాలు చేస్తోంది. ఆ సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.