ప్రియా వారియ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ స్టార్ హీరో కొడుకుతో..?

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ‌.. ఇటీవ‌లె నితిన్ చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బాల్తా ప‌డినా.. ప్రియా వారియ‌ర్‌కు మాత్రం అవ‌కాశాలు వెల్లువెత్తున్నాయి.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌యాళం, హిందీ, తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన ప్రియా వారియ‌ర్ త్వ‌ర‌లోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా రూపొంద‌బోయే సినిమాతో. అర్జున్ రెడ్డి రీమేక్ తో హీరోగా త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ధృవ్‌.. మొద‌టి చిత్రంతోనూ మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ధృవ్ మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఓ సినిమాని చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా వారియ‌ర్‌ను ఎంపిక్ చేసిన‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. ప్రియా వారియ‌ర్‌కు త‌మిళంలో ఇదే మొద‌టి సినిమా అవుతుంది.

Happy Birthday, Dhruv Vikram: Five films of Vikram that can be remade into  sequels for his son | The Times of India

Share post:

Popular