సిగరెట్ కాల్చుతూ వంట‌ల‌క్క ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప్రేమి విశ్వనాథ్ అదేనండీ మ‌న‌ వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది వంట‌ల‌క్క‌. న‌ట‌న‌తోనూ, చిరునవ్వుతోనూ, అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే ఈమె సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా వంట‌ల‌క్క‌ సిగ‌రెట్ కాల్చుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమి ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఎర్ర లుంగీ కట్టుకొని, పసుపు రంగు చొక్కా వేసుకుని, చంకలో కోడిని పట్టుకొని, మరో చేతితో కత్తిని పట్టుకొని కనిపించడమే కాకుండా నోటిలో సిగరెట్ పెట్టుకొని గుప్పు గుప్పు మంటూ పొగ వదులుతూ ర‌చ్చ చేసింది.

బ్యాక్‌గ్రౌండ్‌లో అలా వైకుంఠపురంలో సినిమాలోని సిత్తరాల సిరపడు పాట ప్లే అయింది. మొత్తానికి ఈ వీడియో చూసిన వంట‌ల‌క్క అభిమానులు ఒకింత షాకైనా.. సూప‌ర్‌, వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక త్వ‌ర‌లోనే పూర్తి మేకోవ‌ర్ వీడియో రానున్న‌ట్టు తెలుస్తోంది.

https://www.instagram.com/p/CPQGgqunISw/?utm_source=ig_web_copy_link

Share post:

Latest