ప్లీజ్ సాయం చేయండి..ప్రియుడి త‌ల్లి కోసం పాయ‌ల్ అభ్య‌ర్థ‌న‌!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పాయిల్ రాజ్ పుత్‌.. మొద‌టి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో పాటు న‌ట‌న ప‌రంగా విశ్వ‌రూపం చూపించింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

ప్రియుడి త‌ల్లి కోసం ప్రార్ధ‌న‌లు చేస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. పాయ‌ల్ సౌరబ్ దింగ్రాతో గ‌త కొద్ది రోజులుగా ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని పాయ‌ల్ ఓపెన్‌గానే ప్ర‌క‌టించేసింది. అయితే తాజాగా పాయ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సౌర‌బ్ త‌ల్లి అనిత దింగ్రా ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు పేర్కొంది. ఆమె కోసం అంద‌రు ప్రార్ధ‌న‌లు చేయాల‌ని, ఈ ప్రార్ధ‌న‌లు అద్భుతాల‌ను సృష్టించ‌గ‌ల‌వంటూ కామెంట్ పెట్టింది.

అలాగే ఢిల్లీలో ఓ వెంటిలేటర్‌ బెడ్‌, హర్యానాలోని సోనీపట్‌లో వెంటిలేటర్‌ అంబులెన్స్‌ అవసరం ఉంది.. ఎవరైనా ఉంటే సాయం చేయండి ప్లీజ్ అంటూ పాయ‌ల్ అర్థించింది. పాయిల్ పోస్ట్ బ‌ట్టీ చూస్తుంటే.. సౌర‌బ్ త‌ల్లి అనిత ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత క్షీణించిన‌ట్టు తెలుస్తోంది.