నాగ్‌తో `ఆర్ఎక్స్ 100` భామ ఐటెం సాంగ్‌?

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రం తాత‌, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య సాగే స్టోరీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా న‌టించ‌బోతున్నారు. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుంద‌ట‌. ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పూత్ అయితే ఆ సాంగ్‌కు క‌రెక్ట్ సెట్ అవుతుంద‌ట‌. అందుకే ఇటీవ‌లె మేక‌ర్స్‌ పాయ‌ల్‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింద‌ని టాక్‌. కాగా, ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.