నాగార్జున సినిమాలో ఐటెం సాంగ్‌..క్లారిటీ ఇచ్చిన పాయ‌ల్‌?!

కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుంద‌ని.. అందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పూత్ న‌టిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా ఈ ప్ర‌చారంపై పాయ‌ల్ స్పందించింది. తాను ఏ ఐటెం సాంగ్ లోనూ న‌టించ‌డం లేద‌ని.. ప్ర‌స్తుతం త‌న‌పై వ‌స్తున్న వార్త‌లు కేవ‌లం పుకార్లే అని తేల్చేసింది. కాగా, ఈ బ్యూటీ ఆ మధ్య బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన సీత సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే.