వైరల్ : బంగారు రేకుపై ఎన్టీఆర్ చిత్రం..!

తెలుగువారు అంతా ఎంతో ప్రేమగా అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి సందర్భంగా బంగారు రేకు పై అద్భుత కళాఖండాన్ని తయారు చేసారు. కర్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని బంగారు రేకు పై చేతితో ఎంతో అద్భుతంగా చెక్కారు. నందమూరి తారక రామారావు మే 28, జన్మించారు. ఆయన ఒక గొప్ప నటుడు ఇంకా ప్రజానాయకుడు.

కళకు కాదేది అనర్హమని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ స్వర్ణకారుడు మరొకసారి రుజువు చేశారు. రాజాం పట్టణం కాస్త వీధికి చెందిన మైక్రో ఆర్టిస్టు స్వర్ణ కళాకారుడు అయిన జగధీష్ తన ప్రతిభను మరొకసారి అందరికి చూపించాడు. విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి ఇంకా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాకుడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 99వ జయంతిని పునస్కరించుకుని బంగారు రేకు పై ఒక గొప్ప కళాఖండాన్ని తీర్చి దిద్దారు. కర్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ చిత్రాన్ని ఆయన బంగారు రేకు పై చేతులతో చెక్కారు. కేవలం 0.35 మిల్లీ గ్రాముల బరువున్న ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి 45 నిముషాల వ్యవధి పట్టినట్లు జగదీష్ తెలిపారు.

Share post:

Latest