గర్భవతి అని తెలియ‌దు..కానీ, బిడ్డ పుట్టేసింది!

మాతృత్వం ఎంత గొప్ప‌దో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది. అందుకే పెళ్లైన ప్ర‌తి స్త్రీ గ‌ర్భం దాల్చాల‌ని.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ నివ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ విచిత్ర‌, వింతైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యం తెలియ‌కుండానే ఓ మ‌హిళ‌కు బిడ్డ పుట్టేసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..అమెరికాలోని యూటా రాష్ట్రానికి చెందిన లావినియా మౌంగ తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకని హవాయిలోని హనలూలూకి ఫైట్‌లో బయల్దేరింది. ప్రయాణంలో ఆమెకు ఒక్కసారిగా కడుపులో నొప్పులు మొదలయ్యాయి.

అయితే అదే ఫైట్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో పనిచేసే ముగ్గురు నర్సులతో పాటు వైద్యుడు డేల్‌ గ్లెన్‌ కూడా ప్రయాణిస్తున్నారు. దీంతో ఫైట్‌లోనే లావినియా కాన్పు చేశారు. లావినియా పండంటి మగ శిశువుకు సురక్షితంగా జన్మనిచ్చింది. అయితే డెలివ‌రీ త‌ర్వాత‌ తాను 29 వారాల గర్భవతినని సంగతి తెలియదని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Share post:

Latest