బ్రేకింగ్ : ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌కు బెయిల్..!

గత కొన్ని రోజులకు హాట్ టాపిక్ గా ఉన్న సంగం డెయిరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ సీనియర్‌ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిల్ లభించింది.

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉండగానే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు ఆదేశాలు జైలుకు అందిన తర్వాత ధూళిపాళ్ల విడుదల కానున్నారు. ధూళిపాళ్లకు బెయిల్ రావడంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest