`బింబిసార`గా వ‌స్తున్న కళ్యాణ్ రామ్..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌టాస్ సినిమా త‌ర్వాత స‌రైన హిట్టే చూడ‌ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. చివ‌రిగా ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈయ‌న త‌న 18వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంతో వశిష్ట్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కాబోతున్నాడు. క‌ళ్యాణ్ సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా టైటిల్ ను రివిల్ చేస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు.

దాని ప్ర‌కారం.. ఈ చిత్రానికి బింబిసార అనే టైటిల్‌ను క‌న్ఫార్మ్ చేసిన‌ట్టు అర్థం అవుతోంది. అలాగే తాజాగా విడుద‌ల చేసిన వీడియో కళ్యాణ్ రామ్ కింగ్ గెటప్ లో స‌రికొత్త మేకోవ‌ర్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. చరిత్రను కోల్పోయిన పౌరాణిక భూమిలో నివసించిన ఒక అనాగరిక రాజు కథ బింబిసార‌ సినిమా అని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, కళ్యాణ్ రామ్ కెరీర్‌లో తొలి సోషియో ఫాంటసీ మూవీ ఇదే.

Share post:

Latest