‘గుట్టు చప్పుడు’ ఫ్రిస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

న‌టుడు బ్ర‌హ్మాజీకి ఇండ‌స్ట్రీలో ఉన్న గుర్తంపు అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు సంజయ్‌ రావ్‌ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్ప‌టికే ఓ పిట్ట క‌థ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మ‌రో సినిమాను లైన్‌లో పెట్టాడు. గుట్టు చప్పుడు ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మణీంద్రన్‌ని అనే కొత్త వ్య‌క్తిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు.

ఈ రోజు సంజయ్‌ రావ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ని సంతోషం స్టూడియోలో విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక హీరో సంజయ్‌ రావ్‌ మాట్లాడుతూ ‘‘పక్కా మాస్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా గుట్టు చప్పుడు సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు వివ‌రించారు. ఆ త‌ర్వాత లివింగ్‌ స్టన్‌ మాట్లాడుతూ త‌న‌కు మణీంద్రన్‌ చాలా కాలంగా ఫ్రెండ్మా, సినిమాను బాగా తీస్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇంకా రెండు షెడ్యూల్స్ షూటింగ్ ఉంద‌ని, త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌ని చెప్పారు. మణీంద్రన్‌ మాట్లాడుతూ వైజాగ్‌ నేపథ్యంలో సినిమా ఉంటుంద‌న్నారు.

Share post:

Popular