మంచు ఫ్యామిలీతో సూపర్ స్టార్ ..!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ను షేర్ చేసిన గంట వ్యవధిలోనే బాగా వైరల్ అయ్యింది. రజనీ తాజా చిత్రం ‘అన్నాత్తే’ హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 35 రోజుల షెడ్యూల్ ఈరోజుతో పూర్తైంది. షూటింగ్ ముగిసిన వెంటనే తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి రజనీ వెళ్లినట్టు స్పష్టమవుతోంది. అనంతరం రజనీ చెన్నైకి వెళ్లిపోయారు.

- Advertisement -

‘అన్నాత్తే’ చిత్రాన్ని దర్శకుడు సిరుతై శివ తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, కీలక పాత్రలను పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే యోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.

 

<blockquote class=”twitter-tweet”><p lang=”und” dir=”ltr”>?❤️ <a href=”https://t.co/axCa7I6H08″>pic.twitter.com/axCa7I6H08</a></p>&mdash; Lakshmi Manchu (@LakshmiManchu) <a href=”https://twitter.com/LakshmiManchu/status/1392327831695200256?ref_src=twsrc%5Etfw”>May 12, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Share post:

Popular