కూలిన మెట్రో ఫ్లైఓవర్‌.. ఎక్కడంటే..?

మెక్సికోలో మెట్రో రైలుకి ప్రమాదానికి గురి అయింది.సోమవారం రోజున మెట్రో ఫ్లైఓవర్‌ నుండి రోజులానే ఫాస్ట్ గా వెళుతున్న రైలు ఫైఓవర్‌ హఠాత్తుగా కూలిపోంది. దీంతో రోడ్డు పై అటుగా వెళ్తున్న కొన్ని కార్ల పై మెట్రో రైలు పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా,70 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సహాయక సిబ్బంది వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన పై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ, మెట్రో రైల్‌ వెళ్తున్నప్పుడు అక్కడ బ్రిడ్జ్‌ కూలిపోవటంతో ఈ సంఘటన చోటు చేసుకుందని ఆమె తెలిపారు. రాత్రి 10.30 టైంలో ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందించాలని అధికారులును ఆదేశించారు. ఈ ప్రమాదం జరగడానికి గల ముఖ్య కారణాల పై అక్కడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share post:

Popular