మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్..ఏం జ‌రిగిందంటే?

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మీకి తాజాగా హ్యాక‌ర్స్ షాకిచ్చారు. గ‌త కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి చిట్టి చిల‌క‌మ్మా అనే పేరుతో ఓ యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

పిల్లలు, తల్లిదండ్రులు, నేటి సమాజం, పెంపకం లాంటి విషయాలపై అందరికీ అవగాహన క‌లిగించే వీడియోలు చేస్తూ ఆ చానెల్‌లో పోస్ట్ చేస్తోంది. అయితే తాజాగా హ్యాక‌ర్స్ ఈ చానెల్‌ను హ్యాక్ చేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా మంచు ల‌క్ష్మీ తెలియ‌జేసింది.

చిట్టి చిలకమ్మ యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయింది.. అక్కడ ఎలాంటి వీడియోలు వచ్చినా పట్టించుకోకండి.. మా టీం మొత్తం దాని మీదే పని చేస్తోంది.. వీలైనంత త్వరగా ఆ అకౌంట్‌ను రికవరీ అయ్యేలా చూస్తున్నారు అని ల‌క్ష్మీ ట్వీట్ చేసింది.

Share post:

Popular