కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!

ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. ఇదివరకు వాట్సాప్ ఈ విషయాలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని.. వినియోగదారుల భద్రతకు వ్యతిరేకంగా ఉన్నాయని ట్విట్టర్ తెలుపుతోంది. ముఖ్యంగా తాము భారత ప్రజల అభిమతానికి కట్టుబడి ఉన్నామని కరోనా సమయంలో తమ సర్వీస్ ఎంతో కీలకమైందని తమకు ప్రజలకు మద్దతు ఇవ్వగలమని నిర్వహించినట్లు అయిందని తెలియజేసింది.