ఏపీలో రేషన్ షాపులు బంద్..!

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో సగం మంది బియ్యం పంపిణీ వాహనదారులు(ఎండియు) పనిచేయడంలేదని పేర్కొన్నారు. డోర్‌ డెలివరీ రేషన్‌ పంపిణీపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని, దీనిలో ఉన్న లోపాలను గుర్తించాలని తెలిపారు. ఎండియు లు చేయాల్సిన రేషన్‌ పంపిణీని డీలర్లు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పలువురు డీలర్లు కరోనాతో మృతి చెందారని, డీలర్లకు వ్యాక్సిన్ వేయించడంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న డీలర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని కోరారు. వ్యాక్సిన్‌ వేయించి, డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ నిరసనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు.

Share post:

Latest