ఆనంద‌య్య నాటు మందుపై జ‌గ్గూ భాయ్ కామెంట్స్..!

ఆనందయ్య కరోనా మందుపై ప్రముఖ నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. మానవ జాతిని కాపాడాటానికి ప్రకృతే మన ముందుకు వచ్చిందని, ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనందయ్య మందు ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నానని, అతడిని దేవుడు ఆశీర్వదించాలని జగపతి బాబు ట్వీట్ చేశారు. ఆనంద‌య్య నాటు మందు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ఈ మందు హాట్ టాపిక్. తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల అటెన్ష‌న్ మొత్తం నెల్లూరు కృష్ణపట్నం వైపే ఉంది. ఆనందయ్య నాటు మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్ట రాకపోయినా.. జనం మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. వేల సంఖ్యలో జనం దాని కోసం ఎగబడుతున్నారు. అయితే పూర్తి స్థాయి నివేదిక‌లు వ‌చ్చేవ‌రకు ప్ర‌భుత్వం మందు పంపిణీని నిలిపివేసింది. దీంతో బ్లాక్ మార్కెట్‌కు తెర‌లేపారు కొంద‌రు దుండ‌గులు. తాజాగా జగ్గూ భాయ్ ట్వీట్ తో మరికొందరిలో ఆనందయ్యపై నమ్మకం బలపడినట్లైయ్యింది.

Share post:

Popular