బ్రేకింగ్ : కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!

ఏపీలో ఘోరం జరిగింది. ముగ్గురాయి గనిలో పేలుడు వద్ద ప్రమాదం చోటుచేసుకోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కడపజిల్లాలోని కలసపాడు మండలంలో చోటుచేసుకుంది. ముగ్గురాయి గనిలో కార్మికులు ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు వల్ల కొందరి పరిస్థితి విషమంగా తయారైంది. జిలిటెన్‌ స్టిక్స్‌ వాహనంలో తీసుకువస్తుండగా, ప్రమాదవశాత్తు పేలినట్లు పోలీసులు గుర్తించారు.

ముగ్గురాయి గనిలో పనుల కోసం మొత్తం 40 మంది వరకు కూలీలు వచ్చినట్లు సమాచారం. వీరంతా బద్వేలు, పోరుమామిళ్లకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. గనిలో చిక్కుకున్న మృత దేహాలను వెలికితీయడానికి పోలీసులు ముమ్ముర చర్యలు చేపడుతున్నారు. కార్మికుల మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో అక్కడి పరిస్థితి ఘోరంగా ఉంది. గాయాలపాలైనవారి రోదల మధ్య పోలీసులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.

Share post:

Latest