డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌?

ఎన్నికల సందర్భంగా చేసిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చుకుంటూ దూసుకుపోతున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ క్ర‌మంలోనే తాజాగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అదిరిపోయే శుభవార్త చెప్పాడు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు జ‌గ‌న్ స‌ర్కార్ రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లోకి జమ చేయనుంది. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బటన్ నొక్కి ఒకేసారి జ‌మ‌చేయ‌నున్నారు.

కాగా, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన డ్వాక్రా మహిళలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని వైఎస్సార్‌ సున్నా వడ్డీ ప‌థ‌కం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్ప‌టికే ఒక‌సారి డ‌బ్బు జ‌మ చేయ‌గా.. వరుసగా రెండో ఏడాది ఈ పథకం కింద నగదును అందజేస్తున్నారు.

Share post:

Latest