18 ఏళ్ళు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్..!?

భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వాక్సిన్ అందజేస్తారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కీలక ప్రకటన చేసింది. మన దేశంలో ఒక ఏడాది కంటే పైనే ఈ ప్రక్రియ ఉంటుందని వారు తెలిపారు.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సూచనలు చేసింది. తీవ్రమైన అలర్జీ ఉన్నవారు, గర్భిణిలు, పాలిచ్చే బాలింతలు, 16 ఏళ్ల లోపు పిల్లలకు వాక్సిన్టీ ఇవ్వదని సూచించింది. టీకా తీసుకున్న మహిళలు రెండు మూడు నెలల వరకు గర్భధారణకు దూరంగా ఉండాలని ఇంకా 16 ఏళ్ల లోపు వారికి అసలు వ్యాక్సిన్ వేయవద్దు ఎందుకంటే వారిలో వ్యాక్సిన్‌ను తట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చు అని సూచించింది.