వెంకీ సినిమాకి అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్..?

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత కరోనా తీవ్రతతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు మూవీ యూనిట్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం.

- Advertisement -

అమెజాన్ ప్రైమ్ ముప్పై ఐదు కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్. అయితే ఈ విషయం పై చిత్ర దర్శక నిర్మాతలు ఇంకా నిర్ణయం తీసుకోలేదని వినికిడి. ఈ సినిమా విషయానికి వస్తే, నారప్ప తమిళ చిత్రం అసురన్కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ చిత్రం దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ సూపర్ హిట్ అందుకుంది.

Share post:

Popular