ఆ రేర్ రికార్డుపై వెంకీ క‌న్ను..అల్లాడిపోతున్న కుర్ర‌హీరోలు!?

సాధార‌ణంగా ఓ సినిమా పూర్తి చేయాలంటే మూడు, నాలుగు నెల‌లు ప‌డుతుంది. అదే పెద్ద సినిమా అయితే ఒకటి, రెండు సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఐదు సంవ‌త్స‌రాలు ప‌ట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ కావు.. కేవ‌లం ముప్పై రోజుల్లోనే సినిమా పూర్తి రేర్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు విక్ట‌రీ వెంక‌టేష్‌.

ఇప్ప‌టికే `నార‌ప్ప` సినిమాను పూర్తి చేసిన వెంకీ.. ఆ వెంట‌నే ఎఫ్‌3 సెట్స్‌లో అడుగు పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అలాగే మ‌రోవైపు జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో దృశ్యం 2ను కూడా పట్టాలెక్కించారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను కేవ‌లం ఒక నెల‌లో పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఒక సీనియ‌ర్ స్టార్ హీరో కేవ‌లం ముప్పై రోజుల్లో సినిమా పూర్తి చేయ‌డమంటే అదో రికార్డే అని చెప్పాలి.

ఇక కేవలం నాలుగు నెలల్లో మూడు రిలీజ్ లతో వెంకీ మ‌రో రికార్డ్ కూడా కొల్ల‌గొట్ట‌నున్నాడు. వెంకీ నటించిన నారప్ప (మే 14) .. ఎఫ్ 3 (ఆగస్టు 27) ఇప్పటికే విడుదలకు తేదీలు లాక్ చేసేశారు. ఈ రెండిటి మధ్యలో జూన్ లేదా జూలైలో దృశ్యం 2ని రిలీజ్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏదేమైనా ఈ వ‌య‌సులో వెంకీ జోరు చూసి.. కుర్ర హీరోలు అల్లాడిపోతున్నార‌ని అంటున్నారు.

Share post:

Popular