నాని షాకింగ్ నిర్ణ‌యం..నిరాశ‌లో ఫ్యాన్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ట‌క్ జ‌గ‌దీష్‌` ఒక‌టి. శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, నాజ‌ర్‌, నరేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ కూడా స్టార్ట్ చేసింది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో నాని మ‌రియు చిత్ర యూనిట్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు తాజా ప్ర‌క‌టించింది.

ట‌క్ జ‌గ‌దీష్ సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం. ఈ మూవీని అంద‌రు క‌లిసిక‌ట్టుగా చూడాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో అది సాధ్యం కాదు కాబ‌ట్టి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ చేసి మూవీ రిలీజ్ డేట్ ట్రైల‌ర్ ద్వారా తెలియ‌జేస్తామ‌ని నాని అన్నారు. ఇక ట‌క్ జ‌గ‌దీష్ వాయిదా ప‌డ‌డంతో నాని ఫ్యాన్స్ కాస్త నిరాశ‌కు గుర‌య్యారు.

Share post:

Popular