జ‌మ్మూలో టీటీడీ ఆల‌యానికి భూమిని కేటాయించిన ప్ర‌భుత్వం..!

జ‌మ్మూ క‌శ్మీర్‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం దేవాలయాన్ని నిర్మించనున్నారు. జ‌మ్మూలో నిర్మించ‌నున్న ఆ ఆల‌యం కోసం అక్కడ ప్ర‌భుత్వం ఆలయం కోసం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వ‌నున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకునట్లు తెలిపారు. జ‌మ్మూలో వేద పాఠ‌శాల‌, ఆధ్మాత్మిక‌ ధ్యాన కేంద్రం, రెసిడెన్షియ‌ల్ క్వార్ట‌ర్స్‌, వైద్య‌ విద్యా కేంద్రాల‌ను కూడా వారు నిర్మించ‌నున్నారు.

కేంద్ర పాలిత ప్రాంత‌మైన కా‌శ్మీర్‌లో ఆల‌య నిర్మాణంతో ఆధ్యాత్మిక ప‌ర్యాట‌కం ఇంకా ఎక్కువ పెరుగుతుంద‌ని వారు ఆశిస్తున్నారు. జ‌మ్మూ క‌శ్మీర్‌లోని మాతా వైష్ణ‌వోదేవి, అమ‌ర్‌నాథ్ ఆల‌యాల‌ను సందర్శించేందుకు వేల సంఖ్య‌లో ప్ర‌తి సంవత్సరం భ‌క్తులు వెళ్తుంటారు. ఇక ఇప్పుడు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారి ఆల‌య నిర్మాణంతో టూరిజం ఆదాయం మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉంటాయని వారు ఆశిస్తున్నారు.

Share post:

Latest