టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత మృతి..!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకు కొన్ని లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పై కూడా పడింది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటీనటులు ఇంకా ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ తో నిర్మాత సి.ఎన్.రావు మృతి చెందారు.

కరోనా వైరస్ బారిన పడి నిర్మాత మృతి చెందిన సి.ఎన్.రావు అలియాస్ చిట్టి నాగేశ్వరరావు తెలుగులో మా సిరిమల్లె, అమ్మానాన్నలేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీతో పాటు తమిళంలో ఊరగా వంటి చిత్రాలకు నిర్మాతగా పంపిణీదారుడిగా సి.ఎన్.రావు వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా చిట్టి నాగేశ్వరరావు చేసేవారు. సీ.ఎన్.రావు చనిపోవటంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Share post:

Latest