మెగ‌స్టార్‌తో న‌టించేందుకు నో.. ఎవ‌రంటే?

తెలుగు చిత్ర‌సీమ‌లో రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల‌నేంది ద‌ర్శ‌కులు, నిర్మాతలు, యువ న‌టీన‌టులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డ‌మోక అదృష్టంగానే గాక‌, అదొక వ‌రంగా భావిస్తుంటారు. కానీ అలాంటి అవ‌కాశం వ‌చ్చినా న‌టించేందుకు నిరాక‌రించాడు ఓ యువ న‌టుడు. కార‌ణాలు ఏమిటో తెలియ‌క‌పోయినా చిరు సినిమాలో చేసేందుకు మాత్రం విముఖ‌త‌ను వ్య‌క్తం చేశారు. ఇప్పుడిది చిత్ర‌సీమ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

మలయాళంలో సంచ‌ల‌న విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. జయం మోహ‌న్ రాజా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం జ‌న‌వ‌రి 21న లాంఛ‌నంగా ప్రారంభం కాగా, సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు రీమేక్‌కి బైరెడ్డి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న‌ట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం లూసిఫర్‌ సినిమాకు విలన్‌ వేటలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు సమాచారం. చిరంజీవిని ఢీకొనే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ మెగాస్టార్‌తో నటించే అవాకాశాన్ని అనురాగ్‌ నిరాకరించినట్లు వినికిడి. దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇక అనురాగ్ గ‌తంలో అంజ‌లి సీబీఐ సినిమాలో విల‌న్ గా మెప్పించారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం లూసిఫర్ చిత్ర సెట్‌లో అడుగుపెట్ట‌నున్నారు.

Share post:

Latest