సినిమా సమయంలో కీలక మార్పులు..ఎక్కడంటే..!?

క‌రోనా సెకండ్ వేవ్ రోజురోకూ బాగా విజృంభిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ అంటూ అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా రాత్రి క‌ర్ఫ్యూను విధించింది. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి వ‌చ్చాయి.

దీంతో ఈ ప్ర‌భావం మూవీ థియేట‌ర్ల‌ పై కూడా ప‌డింది. రాత్రి 9 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రావటంతో థియేట‌ర్ల‌ను 8 గంటలకే మూసేయాలని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో థియేటర్ య‌జ‌మానులు సెకండ్ షోను ర‌ద్దు చేసి, మిగ‌తా మూడు షోల స‌మ‌యాల్లో కొన్ని మార్పులు చేశారు. మార్నింగ్ షోను ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 వ‌ర‌కు, మ్యాట్నీ షోను మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయ‌త్రం 4.30 వ‌ర‌కు, ఇంకా సాయంత్రం ఫ‌స్ట్ షోను 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌లకి మార్చారు.

Share post:

Popular