పంచెక‌ట్టులో వెంకీ..ఖుషిలో ఫ్యాన్స్ ..!

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిస్తున్న చిత్రం నార‌ప్ప‌. తమిళ చిత్రం అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారప్ప భార్య పాత్రలో నటి ప్రియమణి నటిస్తుంది. ఈ చిత్రాన్ని కలైపులి యస్ ధను, సురేష్ బాబు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లుకు మంచి స్పందన లభించింది.

ఉగాది సంద‌ర్భంగా మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ పోస్ట‌ర్ లో వెంక‌టేష్ పంచెక‌ట్టులో క‌నిపించి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. రాజీవ్ క‌న‌కాల‌, ప్రియ‌మ‌ణి కూడా ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ప్రేక్షకులందరిని బాగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలోని కొన్నిం కీల‌క స‌న్నివేశాల‌ను రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో తీశారు.

Share post:

Latest