క్వారంటైన్ లోకి మహేష్ బాబు..!?

కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలి పెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం అందరిలో కలకలం రేపుతోంది.

తాజాగా మహేష్ పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితో పాటు మరికొందరిలో కూడా కొవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆ చిత్రం షూటింగ్ నిలిపివేశారు. దీనితో ముందస్తు జాగ్రత్తగా భాగంగా మహేష్ బాబు క్వారంటైన్ లోకి వెళ్లినట్టు సమాచారం.. ఈ విషయం తెలియడంతో ఆయన అభిమానులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.తమ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా కరోనా పాజిటివ్ వస్తుందేమోనని వారు భయపడుతున్నారు. కరోనా పాజిటివ్ రాకుండా ఆయన క్షేమంగా ఉండాలని మహేష్ ఫాన్స్ ప్రార్ధిస్తున్నారు.

Share post:

Latest