వెయ్యేళ్లు వెనక్కి వెళ్తున్న సన్నీ లియోన్!?

బాలీవుడ్‌లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన న‌టి స‌న్నీలియోన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తనదైన శైలిలో సినిమాల్లో యాక్ట్ చేస్తూ న‌టిగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స‌న్నీ.. ఇప్పుడు కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే కోలీవుడ్‌లో స‌న్నీ `వీరమహాదేవి’ అనే సినిమా చేసిన‌ప్ప‌టికీ.. ఇది ఇంకా విడుద‌ల‌కు నోచుకోలేదు. అయితే ఇప్పుడు త‌మిళంలో మ‌రో సినిమా చేయ‌బోతోంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా కోసం వెయ్యేళ్లు వెన‌క్కి వెళ్ల‌బోతోంది స‌న్నీ లియోన్‌. పూర్తి వివరాల్లోకి వెళితే… సతీశ్‌, సంజన ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు ఆర్‌. యువన్‌ ఓ ఫాంటసీ అండ్‌ హిస్టారికల్‌ హారర్‌ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం, వెయ్యేళ్ల క్రితం… రెండు కాలాల్లో జరిగే కథతో దీనిని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో సన్నీ లియోన్‌ రాణిగా క‌నిపిస్తుంది. అందంగా కనిపిస్తూనే భయపెట్టే విధంగా స‌న్నీ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక త్వ‌ర‌లోనే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.‌

Share post:

Popular