తెలంగాణ టీచర్స్ కు శుభవార్త ..అప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్.. !

teacher

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు బాగా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలను రద్దు చేశారు ప్రభుత్వం. మరి కొన్ని వాయిదా వేశారు. తెలంగాణ పాఠశాలలకు మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు ఇంకా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ 23 న చివరి అంటే లాస్ట్ వర్కింగ్ డే గా ప్రకటించి, ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ సెలవలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ప్రతీ ఏడాది లానే ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కానీ కరోనా కారణంగా ఈ సంవత్సరం లేట్ గా పాఠశాలలు మొదలయ్యాయి కాబట్టి మే 27 నుంచి హాలిడేస్ ప్రకటించాలని ముందు అనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో నైట్ కర్ఫ్యూ మొదలయింది. ఈ కారణంగాపాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.