ప్ర‌ముఖ రంగ‌స్థ‌లి న‌టుడు ప్ర‌కాశ్ రాజు క‌న్నుమూత‌..!

తిరుప‌తి న‌గ‌రానికి చెందిన ప్ర‌ముఖ రంగ‌స్థ‌లి న‌టుడు ప్ర‌కాశ్ రాజు 82 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఐదు ద‌శాబ్దాలుగా నాట‌క రంగానికి ఎన‌లేని సేవ‌లు అందిస్తూ వచ్చారు ఆయ‌న. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాల్లో కూడా ప్ర‌కాశ్ రాజు నటించారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. దీనితో శ‌నివారం రాత్రి ఆయన క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

అశోక్‌ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య చంద్రగుప్త, విశ్వనాథ నాయకుడు, లేపాక్షి, అక్భర్‌ అంతిమ ఘడియలు వంటి అనేక నాట‌ల‌కాల‌తో మంచి పేరు తెచ్చుకున్న ప్ర‌కాశ్ రాజు 1977లో భవాని కళానికేతన్‌ నాటక సంస్థను ఏర్పాటు చేసి అనేక మంది నూతన కళాకారులను ప్రోత్సహించారు రంగ‌స్థ‌లి న‌టుడు ప్ర‌కాశ్ రాజు . ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.

Share post:

Popular