మ‌హేష్ నో చెప్పిన ఆ సినిమాకు సోనూసూద్ గ్రీన్‌సిగ్నెల్‌?

అధికారికంగా ప్ర‌క‌టించి కూడా ప‌ట్టాలెక్క‌ని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` ఒక‌టి. మొదట‌ ఈ చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాల‌ని పూరీ భావించారు. అఫిషియ‌ల్‌ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు. కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో.. మ‌హేష్ ఈ సినిమా చేసేందుకు నో చెప్పాడు.

- Advertisement -

దీంతో ఈ సినిమా మరుగున మడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, పూరీ మాత్రం ఇటీవ‌లె ‘జగనణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్. త్వరలోనే ఈ సినిమాను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాను` అని ప్ర‌క‌టించాడు. అయితే తాజా సామాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని సోనూసూద్‌తో చేసేందుకు పూరీ రెడీ అయ్యాడ‌ట‌.

దేశభక్తి నేపథ్యంలో రూపొందించిన కథ కాబట్టి.. సోనూసూద్‌ అయితే సరిగ్గా సరిపోతాడ‌ని పూరీ భావిస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే సోనూకు ఇటీవ‌ల పూరీ క‌థ చెప్ప‌గా.. ఆయ‌న వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాలంటే.. ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular