‘శుక్ర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు..!

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేత అంటున్నారు కానీ, ఏది ఏమైనా శుక్ర చిత్రం రిలీజ్ చేయడానికే మేము నిర్ణయించుకున్నాం. మా చిత్రం రిలీజ్ కు సహకరించిన మధుర శ్రీధర్‌గారికి చాలా థ్యాంక్స్ అని దర్శకుడు సుకు పూర్వజ్‌ అన్నారు. అరవింద్‌ కృష్ణ, శ్రీజితా ఘోష్‌ జంటగా అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మించిన శుక్ర చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. సుకు పూర్వజ్‌ మాట్లాడుతూ, మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది అని అన్నారు.

తేజ్‌ పల్లె మాట్లాడుతూ, మాకున్న బడ్జెట్‌కు ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్‌ చేయగలిగాము అంటే సినిమాటోగ్రాఫర్‌ జగదీశ్‌ ప్రతిభే కారణం. సుకు పూర్వజ్‌ మంచి కమర్షియల్‌ డైరెక్టర్‌ అవుతాడు అని అన్నారు. మీ అందరికి మా చిత్రం పాటలు, ట్రైలర్, విజువల్స్‌ నచ్చితే థియేటర్లకు తప్పకుండా రండి. మాస్క్‌ పెట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ మా చిత్రం చూడండి అని అన్నారు అరవింద్‌ కృష్ణ.

Share post:

Latest