సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత వర్క్ ఔట్స్ పిక్..!

నేటి కాలంలో నటి నటులు ఇంకా అందాల భామ‌లు శ‌రీర సౌష్టవం పై ఎంత‌ శ్ర‌ద్ధ పెడుతున్నారో స్పెషల్గా చెప్ప‌నవసరంలేదు. జిమ్‌ల‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ, అటు డైట్ విష‌యంలో కూడా స్ట్రిక్టుగా ఉంటూ మంచి స్లిమ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. టాలీవుడ్ నటీమణులు విషయానికి వ‌స్తే స‌మంత‌, ర‌కుల్, మంచు ల‌క్ష్మీ వంటి స్టార్స్ త‌ర‌చుగా త‌మ సోష‌ల్ మీడియాలో వ‌ర్క‌వుట్స్‌కు సంబంధించిన వీడియోలు పెడుతూ అందరితో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా అక్కినేని కోడ‌లు స‌మంత త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో వర్క‌వుట్‌కు సంబంధించిన పిక్ ఒక్కటి షేర్ చేసి అంద‌రిని ఆశ్చర్య పరిచింది. త‌ల కిందకు కాళ్లు పైకి పెట్టి తాడు సాయంతో ఆస‌నం చేస్తూ, ఫొటో షేర్ చేస్తూ, లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేది అనే క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. సోషల్ మీడియాలో స‌మంత పిక్ ఇప్పుడు నెటిజ‌న్స్‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటుంది.

Share post:

Latest