నా ల‌క్ష్యం ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి అంటున్న ర‌ష్మిక‌!‌

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. వ‌రుస హిట్ల‌తో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో కూడా న‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతోంది.

ప్ర‌స్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ.. యాక్ట‌ర్ అవ్వాల‌నే అనుకోలేద‌ట‌. అందుకే నా ల‌క్ష్యం ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి అంటోంది ర‌ష్మిక‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక మాట్లాడుతూ..`మైసూర్‌ కాలేజీ రోజుల్లో నా ఊహలు భిన్నంగా ఉండేవి. టీచర్‌ వృత్తిలో స్థిరపడాలనుకున్నా.

అందుకే సైకాలజీ, ఇంగ్లీష్‌ సాహిత్యంలో డిగ్రీ చేశాను. కానీ, విధి మరోలా తలచింది. అనుకోకుండా మోడలింగ్‌ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు జీవితాన్ని తరచి చూసుకుంటే అంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.` అని చెప్పుకొచ్చింది. అద‌న్న‌మాట‌.. టీజ‌ర్ అవ్వాల‌నుకున్న ర‌ష్మిక అనుకోకుండానే యాక్టివ్ అయిపోయింది.